August 4, 2025 7:03 pm

Email : bharathsamachar123@gmail.com

Breaking

Cricket Catches: క్రికెట్‌లో కొత్త రూల్.. ఇకపై అలాంటి క్యాచ్‌లు చెల్లవు 

భారత్ సమాచార్.నెట్: క్రికెట్ (cricket) నిబంధనల్లో అంతర్జాతీయ క్రికెట్ మండలి(ICC), మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (MCC) కొత్త నిబంధనలు (New Rules) తీసుకువచ్చింది. బౌండరీ లైన్ (Boundary Line) వద్ద ఫీల్డర్లు (Fielders) అందుకునే క్యాచ్‌ (Catch)లో మార్పులు చేసింది. బౌండరీ లైన్ వెలుపల గాల్లోకి ఎగిరే బంతిని పట్టుకునే బన్నీ హప్ క్యాచ్‌లు ఇకపై చెల్లుబాటు కావు. ప్రస్తుతం క్రికెట్​లో ఫీల్డర్లు, బౌండరీలైన్ దాటి బంతిని పట్టుకొని పలుమార్లు గాల్లోకి విసిరి, ఆ తర్వాత లైన్ లోపలకు వచ్చి క్యాచ్​ పూర్తి చేస్తుంటారు. దీన్ని ఇప్పుడు ఔట్​గానే పరిగణిస్తున్నారు.
అయితే ఇలాంటి క్యాచ్​లు ఔట్‌​గా పరిగణిండంపై పలువురు అభ్యంతంరం తెలుపుతున్నారు. ఇది కరెక్ట్ కాదంటూ అభిప్రాయపడుతున్నారు. దీంతో ఇకపై అలాంటి క్యాచ్​లు చెల్లవని స్పష్టం చేసింది. కొత్త రూల్ ప్రకారం.. ఫీల్డర్ బౌండరీ లైన్ దాటి బయటకు వెళ్లి గాల్లో బంతి అందుకుంటే.. ఒకే ప్రయత్నంలో దాన్ని తిరిగి లోపలికి విసిరి.. వెంటనే విసిరిన బంతిని లోపలికి వచ్చి పట్టుకుంటే.. అప్పుడు దాన్ని క్యాచ్‌గానే పరిగణించనున్నారు.
ఒకవేళ బౌండరీ లైన్ బయట నుంచి బంతిని రెండుసార్లు గాల్లోకి విసిరితే అది సిక్స్​‌గానే పరిగణిస్తారు. అంటే బౌండరీ లైన్ బయట ఫీల్డర్, బంతిని ఒకేసారి తాకాలి అన్నమాట. రెండుసార్లు గాల్లోకి ఎగురవేయండం ఇకపై కుదరదు. ఈ కొత్త రూల్ 2025-27 వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ కొత్త ఎడిషన్‌లో భాగంగా శ్రీలంక- బంగ్లాదేశ్​ మధ్య జూన్ 17న జరగనున్న తొలి టెస్టు నుంచి అమలు కానుంది. ఐసీసీ నిర్వహించే అన్ని మ్యాచ్‌ల్లో ఈనెల నుంచే అమలు కానుంది. ఇక ఎమ్​సీసీ రూల్స్​‌ల్లో మాత్రం 2026 అక్టోబర్​లో చేర్చనున్నారు.
Share This Post