భారత్ సమాచార్, జాతీయం ;
భారత ప్రభుత్వం డ్రైవింగ్ లైసెన్స్ జారీపై కొత్త నిబంధనలను తాజాగా ప్రకటించింది. ఇకపై ప్రవేటు సంస్థల్లోనూ ప్రజలు డ్రైవింగ్ లెసెన్స్ ను పొందేలా మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ కొత్త నిబంధనలు జూన్ 1వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయి. అయితే సర్టిఫికెట్ ఇచ్చే సంస్థలు కచ్చితంగా కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. డ్రైవింగ్ టెస్టు నిర్వహించటానికి అన్ని సదుపాయాలు ఉన్న ప్రైవేటు సంస్థలు ఈ టెస్టులు నిర్వహించి, సర్టిఫికెట్లు ఇవ్వొచ్చు. 4 వీలర్ టెస్ట్ నిర్వహించాలంటే ప్రైవేటు డ్రైవింగ్ సెంటర్ కి కచ్చితంగా 3 ఎకరాల స్థలం ఉండి తీరాలి. ట్రైనర్లకు క్వాలిఫికేషన్ గా హైస్కూల్ విద్య, ఐదేళ్ల డ్రైవింగ్ అనుభవం ఉండి తీరాలి. లైట్ వెహికల్స్ కి 29 గంటలు, హెవీ వెహికల్స్ కు 39 గంటల శిక్షణ తప్పనిసరి చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది. జూన్ 1 తర్వాత దీనిపై మరింత సమాచారం అందే అవకాశం ఉంది.