భార‌త్ స‌మాచార్, విద్య‌ : ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు బోర్డు కీలక సమాచారం వెల్లడించింది. 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల (థియరీ) తాత్కాలిక షెడ్యూల్‌ను ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యా మండలి విడుదల చేసింది. ఈ షెడ్యూల్ ప్రకారం ప్రథమ సంవత్సరం పరీక్షలు 2027 ఫిబ్రవరి 24న ప్రారంభమై మార్చి 15న ముగియనున్నాయి. ద్వితీయ సంవత్సరం పరీక్షలు ఫిబ్రవరి 25న మొదలై మార్చి 16 వరకు కొనసాగనున్నాయి. రెండు సంవత్సరాల విద్యార్థులకు పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం…