భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనలో ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. బీఆర్‌ఎస్ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు చేపట్టిన కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై ఛార్జ్‌షీట్ కార్యక్రమంలో భాగంగా సోమవారం జిల్లా ప్రజావాణి కేంద్రంలో ఈ వినతిపత్రాన్ని సమర్పించారు.

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన 420 హామీల అమలు తీరుపై బీఆర్‌ఎస్ నాయకులు ప్రశ్నలు లేవనెత్తారు. హామీలను అమలు చేయడంలో…