భారత్ సమాచార్, మెదక్ జిల్లా: దసరా పండుగ సందర్భంగా మెదక్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పండుగ సందడి నెలకొంది. మాజీ డిప్యూటీ స్పీకర్ ఎం. పద్మా దేవేందర్‌రెడ్డిని నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆత్మీయంగా కలుసుకుని పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పండుగ వేళ పార్టీ శ్రేణుల రాకతో కార్యాలయం సందడిగా మారింది.
దసరా పండుగను పురస్కరించుకుని పలువురు నాయకులు, కార్యకర్తలు పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా పద్మా దేవేందర్‌రెడ్డిని కలిసి విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు.…






