భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: మండలంలోని శ్రీరామగిరి గ్రామంలో ఇటీవల ఏర్పాటు చేసిన బతుకమ్మ విగ్రహానికి సంబంధించిన శిలాఫలకం ధ్వంసం కావడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లతో శిలాఫలకాన్ని పగలగొట్టారని గ్రామ సర్పంచి మాదరి ప్రశాంత్ తెలిపారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులను గుర్తించి, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ గురువారం నెల్లికుదురు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
సర్పంచి మాదరి ప్రశాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 17న గ్రామంలో బతుకమ్మ విగ్రహాన్ని…






