భారత్ సమాచార్, మహబూబాబాద్ : ఇనుగుర్తి మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులుగా బానోతు వీరన్న నాయక్, మామిడి జనార్ధన్ నియమితులయ్యారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బైరు అశోక్ గౌడ్ శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. మండలంలోని పెద్ద తండాకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ యువ నాయకుడు బానోతు వీరన్న నాయక్‌తో పాటు అయ్యగారిపల్లి గ్రామానికి చెందిన మామిడి జనార్ధన్‌కు పార్టీ నాయకత్వం ఈ బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు.
పార్టీ సంస్థాగత బలోపేతంలో భాగంగా వీరిద్దరికి ఉపాధ్యక్షుల బాధ్యతలు అప్పగించినట్లు…






