భారత్ సమాచార్, మెదక్ జిల్లా: గ్రామీణ ప్రాంతాల్లో కాలుష్యాన్ని వెదజల్లుతున్న పరిశ్రమలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని దుబ్బాక MLA కొత్త ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని, పర్యావరణాన్ని కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. చేగుంట మండల కేంద్రంలోని జీవీకే ఇండస్ట్రీ నుంచి వెలువడుతున్న కాలుష్యంపై సమగ్ర విచారణ జరిపి, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
గతంలో చిన్న స్థాయిలో ఉన్న జీవీకే ఇండస్ట్రీ ప్రస్తుతం సుమారు 10 నుంచి 15 ఎకరాల విస్తీర్ణానికి విస్తరించిందని MLA తెలిపారు.…






