భారత్ సమాచార్, విద్య : తెలంగాణలో ఎండలు, నీటి కొరతపై ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో పాఠశాలలకు ఈసారి ముందుగానే వేసవి సెలవులు ప్రకటిస్తారా అనే చర్చ మొదలైంది. ముఖ్యంగా హైదరాబాద్లో మార్చి నుంచే పాఠశాలల నిర్వహణ కష్టమవచ్చని విద్యావేత్త వాసిరెడ్డి అమర్నాథ్ అభిప్రాయపడినట్లు వార్తలు వెలువడ్డాయి. అయితే, మార్చి నుంచే సెలవులు ప్రారంభిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
ఎల్నినో ప్రభావం, వర్షపాతం లోటు వంటి అంశాల నేపథ్యంలో వేసవిలో నీటి లభ్యతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. నీటి సరఫరా తగ్గితే…



