భారత్ సమాచార్, ఉద్యోగాలు : తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ (FBO) నియామకాలు కీలక అవకాశంగా మారనున్నాయి. అటవీశాఖలో 1,395 పోస్టుల భర్తీకి సంబంధించి టీజీపీఎస్సీ (TGPSC) కసరత్తు చేస్తున్నట్లు వార్తలు వెలువడ్డాయి. కమిషన్ ఛైర్మన్ బుర్రా వెంకటేశం నియామక ప్రక్రియను వేగవంతం చేయడం, పరీక్షల్లో పారదర్శకత పెంచడంపై దృష్టి పెట్టినట్లు గతంలో ప్రకటించారు. అయితే, తాజా సమాచారం ప్రకారం కమిషన్ వెబ్‌సైట్‌లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నియామకానికి సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు కూడా కనిపిస్తున్నాయి.
టీజీపీఎస్సీ…



