భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: భూమి కోసం, భుక్తి కోసం, దేశ విముక్తి కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల ఆశయాలను కొనసాగించడమే వారికి అర్పించే నిజమైన నివాళి అని సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి కా. మండల వెంకన్న తెలిపారు. నెల్లికుదురు మండలం రావిరాల గ్రామంలో కామ్రేడ్ సురేషన్న, గణపతిల స్తూపాల వద్ద సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించారు.
అనంతరం జరిగిన సభలో మండల వెంకన్న మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 80…






