భార‌త్ స‌మాచార్, సినిమా : 90వ దశకం, 2000ల ప్రారంభంలో అమ్మమ్మ ఊరికి వెళ్లి వేసవి సెలవులు గడిపిన అనుభవాలు చాలామందికి మధుర జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి. అలాంటి బాల్యపు రోజులు, పల్లెటూరి వాతావరణం, చిన్ననాటి స్నేహాలను ప్రధానంగా తీసుకుని తెరకెక్కిన చిత్రమే ‘సమ్మర్ హాలిడేస్’. రోహన్ రాయ్, అరుణ్ దేవ్, ఖుషి సోని ప్రధాన పాత్రల్లో శ్రీకర్ నయన్ జి దర్శకత్వం వహించిన ఈ సినిమాను ధీరజ్ మొగిలినేని, గిరిబాబు వల్లభనేని నిర్మించారు. నవంబర్ 6న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం నాస్టాల్జిక్ ఫ్యామిలీ…