భార‌త్ స‌మాచార్, విశాఖపట్నం : విశాఖపట్నంలోని రుషికొండ బీచ్‌లో గురువారం అరుదైన దృశ్యం కనిపించింది. భారత కోస్ట్ గార్డ్‌కు చెందిన రెండు అధునాతన హోవర్‌క్రాఫ్ట్‌లు సముద్రం నుంచి నేరుగా తీరానికి చేరుకోవడంతో పర్యాటకులు, స్థానికులు ఆసక్తిగా తిలకించారు. సాధారణంగా సముద్రంలో కనిపించే నౌకలు ఇసుక తీరంపైకి రావడం చూసి సందర్శకులు ఆశ్చర్యపోయారు. ఈ ప్రత్యేక నౌకలను దగ్గరగా చూసేందుకు పలువురు బీచ్‌కు తరలివచ్చారు.

ఈ హోవర్‌క్రాఫ్ట్‌లు గోవా నుంచి పశ్చిమ బెంగాల్‌లోని హల్దియా వైపు ప్రయాణిస్తున్నట్లు సమాచారం. మార్గమధ్యంలో తుపాను గాలులు, ప్రతికూల వాతావరణ…