భారత్ సమాచార్, మహబూబాబాద్ : జిల్లాలో అక్రమంగా గుడుంబా తయారీ, విక్రయాలను అరికట్టేందుకు పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా మహబూబాబాద్ జిల్లా ఎస్పీ శబరీష్ ఆదేశాల మేరకు శుక్రవారం ఇనుగుర్తి మండలంలోని తారాసింగ్ తండా గ్రామపంచాయతీ పరిధిలోని బావోజీ తండాలో గుడుంబా తయారీ స్థావరాలపై పోలీసులు విస్తృతంగా దాడులు నిర్వహించారు. సీఐ సత్యనారాయణ నేతృత్వంలో చేపట్టిన ఈ తనిఖీల్లో అక్రమ మద్యం తయారీకి ఉపయోగించే పదార్థాలను గుర్తించి చర్యలు తీసుకున్నారు.

తనిఖీల సందర్భంగా గుడుంబా తయారీ కోసం రహస్యంగా నిల్వ ఉంచిన…