భారత్ స‌మాచార్.నెట్, క‌ర్నూలు జిల్లా : భారతదేశ చరిత్రలో చిరస్మరణీయమైన ఇద్దరు మహనీయులు, మహాత్మా గాంధీ 156వ జయంతి, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలను ఆదోనిలోని మిల్టన్ పాఠశాలలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కరస్పాండెంట్ హెచ్.రమేష్ బాబు అధ్యక్షత వహించారు.

ముఖ్య అతిథిగా పాల్గొన్న సీఈఓ వెంకటేష్ మాట్లాడుతూ.. గాంధీజీ అనుసరించిన అహింసా మార్గం, అలాగే మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి సాదాసీదా జీవనం నేటి విద్యార్థులకు గొప్ప ఆదర్శమని అన్నారు. ఈ మహనీయుల ఆదర్శాలను, నైతిక విలువలను…