భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: భారత మాజీ క్రికెటర్, తెలుగు తేజం అంబటి రాయుడు మరోసారి తండ్రయ్యాడు. అతని సతీమణి విద్య మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని రాయుడు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వెల్లడించాడు. తన భార్య, బిడ్డతో ఉన్న ఫొటోను రాయుడు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. ‘మాకు కొడుకు పుట్టాడు.. సంతోషంగా ఉంది.’అని రాయుడు క్యాప్షన్‌గా పేర్కొన్నాడు.
అంబటి రాయుడు, విద్యకు 2009లో వివాహం జరగ్గా.. 2020 జూలైలో ఈ దంపతులకు మొదటి సంతానంగా ఆడ బిడ్డ జన్మించింది. ఆ పాపకు వివియా…




