భార‌త్ స‌మాచార్.నెట్, సంగారెడ్డి: తెలంగాణ సంస్కృతికి, ఆత్మీయతకు బతుకమ్మ పండుగ ప్రతీకగా నిలుస్తుందని జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రకృతిని దైవంగా పూజించే ఈ పండుగను నిర్వహించడం ద్వారా మన సంస్కృతిని, విలువలను భావితరాలకు అందించవచ్చని పేర్కొన్నారు. అనంతరం కలెక్టర్, మహిళా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, సాంప్రదాయ వేషధారణలోని విద్యార్థులతో కలిసి ఉత్సాహంగా బతుకమ్మ ఆడి, పాటలు పాడారు. ఈ కార్యక్రమంలో డీఈవో…