భారత్ సమాచార్.నెట్: ప్రముఖ హీరో విజయ్‌ దేవరకొండపై హైదరాబాద్ రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో SC/ST అట్రాసిటీ కేసు నమోదైంది. ఇటీవల సూర్య నటించిన ‘రెట్రో’ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన విజయ్‌ దేవరకొండ.. తన ప్రసంగంలో గిరిజనులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. విజయ్ కామెంట్స్‌ గిరిజనుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశాయని ఆరోపిస్తూ గిరిజన సంఘాల జాయింట్‌ యాక్షన్‌ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు నేనావత్‌ అశోక్‌ కుమార్‌ నాయక్‌ రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. విజయ్ వ్యాఖ్యలు గిరిజనులను కించపరిచేలా ఉన్నాయని.. గిరిజన సమాజాన్ని…