భారత్ సమాచార్, ప్రకాశం జిల్లా: కనిగిరి నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులుగా దొడ్డ సురేష్ రెడ్డి నియామకం అయ్యారు. ఈ సందర్భంగా సురేష్ రెడ్డి మాట్లాడుతూ తన మీద నమ్మకం ఉంచి తనకు తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షులుగా పదవిని కేటాయించిన ప్రియతమ ఎమ్మెల్యే డా.ముక్కు ఉగ్ర నరసింహారెడ్డికి మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానన్నారు. తనకు కేటాయించిన బాధ్యత కోసం కష్టపడి పని చేస్తానని తెలుపుతూ, ఉగ్ర అడుగుజాడల్లో పయనించి, ఆయన ఆశయం అయిన కనిగిరి అభివృద్ధి కి కృషి చేస్తానని తెలిపారు.

మరిన్ని కథనాలు: