భారత్ సమాచార్, అమరావతి ;

కళాశాల విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం కింద ప్రభుత్వం చెల్లించే ఫీజులను నేరుగా కాలేజీల ఖాతాలకు జమ చేసే విధానం తీసుకొచ్చేందుకు కూటమి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. పాత విధానంపై విధివిధానాలు రూపొందించాలని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్‌ విద్యాశాఖ అధికారులను తాజాగా ఆదేశించారు. గత టీడీపీ ప్రభుత్వంలో కాలేజీలకు నేరుగా ఫీజులు ఇచ్చే విధానం ఉండగా, వైసీపీ ప్రభుత్వం తల్లుల ఖాతాల్లో జమ చేసే విధానం ప్రవేశపెట్టింది. కానీ సకాలంలో ప్రభుత్వం నుంచి…