భార‌త్ సమాచార్.నెట్, సంగారెడ్డి: హైదరాబాద్ శివారులోని అన్నారం గుబ్బ కోల్డ్ స్టోరేజ్ సెంటర్‌లో బుధవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి వేగంగా కోల్డ్ స్టోరేజ్ మొత్తానికి వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని సిబ్బంది తెలిపారు. అయితే, భారీగా ఆస్తినష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. గుబ్బ కోల్డ్ స్టోరేజ్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహిస్తున్న ఈ సెంటర్‌లో ఆహారం, విత్తనాలు, ఔషధాలు, వ్యాక్సిన్‌ల నిల్వ కోసం…