భారత్ సమాచార్, స్పోర్ట్స్: న్యూజీలాండ్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ టి20 అంతర్జాతీయ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికారు. 2011లో టి20ల్లో అరంగేట్రం చేసిన కేన్, ఇప్పటివరకు ఆడిన 93 మ్యాచ్‌లలో 2,575 పరుగులు చేశారు. ఇందులో 18 హాఫ్ సెంచరీలు ఉండగా, అత్యధిక వ్యక్తిగత స్కోర్ 95 పరుగులు.‌

 

కివీస్ తరఫున 75 మ్యాచ్‌లకు కెప్టెన్సీ చేసిన విలియమ్సన్, జట్టును పలు కీలక విజయాల దిశగా నడిపించారు. అంతర్జాతీయ కెరీర్‌లో స్థిరతతో పాటు నిబద్ధతకు నిదర్శనమైన ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. షార్టెస్ట్…