భారత్ సమాచార్, మెదక్ జిల్లా: మెదక్ జిల్లా తూప్రాన్ మండలం నాగులపల్లి గ్రామంలో సోమవారం కురిసిన భారీ అకాల వర్షం రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ఐకేపీ కొనుగోలు కేంద్రం వద్ద రోడ్లపై నిల్వ ఉంచిన వరి ధాన్యం కుప్పలు పూర్తిగా వర్షం నీటిలో తడిసి ముద్దయ్యాయి. కొనుగోలు కోసం రోజుల తరబడి ఎదురు చూస్తున్న రైతులకు ఈ వర్షం మరింత కష్టాలను తెచ్చిపెట్టింది. గ్రామంలోని ఐకేపీ సెంటర్‌లో సరైన రక్షణ చర్యలు లేకపోవడంతో వర్షపు నీరు నేరుగా ధాన్యం కుప్పలలోకి చేరింది. దీంతో…