భారత్ సమాచార్, జాతీయం : భూ కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో విచారణను ఎదుర్కొంటున్న జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ బుధవారం తన పదవికి అధికారికంగా రాజీనామా చేశారు. గవర్నర్ కి తన రాజీనామ పత్రాన్ని పంపారు. ఆయన స్థానంలో జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) సీనియర్ నేత, రవాణా శాఖ మంత్రి చంపా సోరెన్ కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) హేమంత్ సోరెన్ ఇంటికి చేరుకుని 7గంటలకు పైగా ప్రశ్నించి, ఆ తర్వాత ఆయనను అరెస్ట్ చేసింది.
…



