భారత్ సమాచార్.నెట్: ప్రముఖ నటుడు, టీవీకే చీఫ్ విజయ్ నిర్వహించిన కరూర్ తొక్కిసలాట ఘటనపై నటి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఖుష్బూ సుందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పక్కా ప్లాన్ ప్రకారమే ఉద్దేశపూర్వకంగా కొందరు సృష్టించారని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందని స్పష్టంగా కనిపిస్తోందని.. సరైన ర్యాలీ స్థలం ఇవ్వకపోవడంతోనే ఈ ఘటన చోటుచేసుకుందన్నారు.
ఈ తొక్కిసలాట ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోయారని ఆమె గుర్తుచేశారు. దీనిపై మౌనంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం స్పందించాల్సిన…

