భారత్ సమాచార్, సూర్యాపేట జిల్లా: సూర్యాపేట జిల్లా BJP గిరిజన మోర్చా అధ్యక్షులుగా మాలోతు సక్రు నాయక్ నియామకం అయ్యారు. BJP జిల్లా అధ్యక్షురాలు చల్ల శ్రీలత రెడ్డి ఈ విషయాన్ని తెలిపారు. జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన సక్రు నాయక్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షులుగా నియామకం చేసిన BJP అధిష్టానానికి, జిల్లా అధ్యక్షురాలికి, కడియం రామచంద్రయ్యకి ధన్యవాదాలు తెలియజేశారు. జిల్లాలో BJP బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని తెలియజేశారు.