భారత్ సమాచార్, మెదక్ జిల్లా: మెదక్ జిల్లాలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోందని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. జిల్లాలోని మొత్తం 4,53,140 మంది ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలను 100 శాతం పంపిణీ చేయగా, ఇప్పటివరకు 90 శాతం ఫారాల డిజిటలైజేషన్ పూర్తయిందని వెల్లడించారు. మరో రెండు నుంచి మూడు రోజుల్లో డిజిటలైజేషన్ ప్రక్రియను పూర్తిస్థాయిలో ముగించనున్నట్లు తెలిపారు.

బుధవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) సుదర్శన్ రెడ్డి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి…