భారత్ సమాచార్, ఆంధ్రప్రదేశ్: ఆంధ్రప్రదేశ్ ఆక్వా రంగానికి మంత్రి నారా లోకేశ్ శుభవార్త తెలిపారు. తెల్లమచ్చ వైరస్ (White Spot Virus) కారణంగా ఇంతవరకు పొట్టు తీయని రొయ్యల ఎగుమతులపై ఆస్ట్రేలియా ప్రభుత్వం విధించిన పరిమితులను తాజాగా ఎత్తివేసి, భారతదేశం నుంచి మళ్లీ ఎగుమతులకు అనుమతినిచ్చిందని ఆయన వెల్లడించారు. ఈ నిర్ణయం వల్ల రాష్ట్ర ఆక్వా రైతులు, ఎగుమతిదారులకు గణనీయమైన ఊరటనిచ్చే అవకాశం ఉందన్నారు. దీనికి కృషి చేసిన భారత, ఆస్ట్రేలియా ప్రభుత్వాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
లోకేశ్ మాట్లాడుతూ, ఈ పరిణామం ఆక్వా…


