భారత్ సమాచార్, తెలంగాణ: రచయిత అందె శ్రీ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. రాష్ట్ర సాధనలో ఆయన పాత్ర మరువలేనిదని.. ఆయనకు సముచిత స్థానం కల్పిస్తామన్నారు. రాష్ట్ర గీతాన్ని పాఠ్య పుస్తకాల్లో ప్రచురిస్తామన్నారు. అందె శ్రీకి పద్మశ్రీ ఇవ్వాలని కేంద్రాన్ని విజ్ఞప్తి చేస్తామన్నారు. అయన కళాకారుడిగా, రచయితగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. అంతేకాదు అయన రచనలను పుస్తకాల్లోకి తీసుకొస్తామన్నారు.
అందె శ్రీ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం: సీఎం రేవంత్





