భారత్ సమాచార్ ; మొత్తానికి అనేక రాజకీయ మలుపులు, అధికార, ప్రతిపక్షాల ఆరోపణల మధ్య ఆంధ్రప్రదేశ్ లో నిన్నటి నుంచి పెన్షన్ పంపిణీ కార్యక్రమం మొదలైంది. ఎన్నికల కమిషన్ వాలంటీర్ల సేవలను రద్దు చేయటం వలన సాధారణం కంటే మూడు రోజులు ఆలస్యంగా పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రామ/ వార్డు సచివాలయం ఉదోగ్యులు ద్వారా మొదటి రోజు(నిన్న మధ్యాహ్నం నుండి) 39.58% పెన్షన్ పంపిణీ పూర్తి అయినట్లు అధికారులు వెల్లడించారు. పెన్షన్ పంపిణీలో ఎటువంటి సమస్యలు తలెత్తలేదని తెలిపారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో ఎండతీవ్రతతో…