భారత్ సమాచార్.నెట్: ప్రముఖ సినీ నటుడు రాజీవ్ కనకాలకు రాచకొండ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఓ ప్లాటు అమ్మిన విషయంలో రాజీవ్ కనకాలకు ఈ నోటీసులు ఇచ్చారు అధికారులు. అలాగే సినీ నిర్మాత విజయ్ ​చౌదరిపై కూడా హయత్ ​నగర్‌ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. గతంలో విజయ్ చౌదరికి రాజీవ్ కనకాల ఫ్లాట్‌ను విక్రయించారు. ఈ క్రమంలోనే ఆయనపై కేసు నమోదైనట్లు తెలుస్తోంది.

 

రంగారెడ్డి జిల్లా పసుమాముల రెవెన్యూ పరిధిలోని సర్వేనంబర్ 421లో ఉన్న రాజీవ్ కనకాలకు చెందిన ప్లాట్ నంబర్69ని విజయ్​…