భారత్ సమాచార్, మెదక్ జిల్లా: జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని రామాయంపేటలో వివేకానంద విద్యాలయంలో విద్యార్థులు సృజనాత్మక ప్రతిభను ప్రదర్శించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సైన్స్ ప్రదర్శనలో దాదాపు 200కు పైగా శాస్త్రీయ ప్రాజెక్టులను విద్యార్థులు రూపొందించి ప్రదర్శించడం విశేషంగా నిలిచింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి ప్రదర్శనను ప్రారంభించి విద్యార్థుల ప్రతిభను ప్రశంసించారు. చిన్న వయసులోనే శాస్త్రీయ ఆలోచనా విధానం పెంపొందించుకోవడం భవిష్యత్తుకు బలమైన పునాది అవుతుందని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు తయారు చేసిన పర్యావరణ పరిరక్షణ,…