భారత్ సమాచార్.నెట్, మెదక్: రామాయంపేట, నిజాంపేట మండలాల రైతులకు వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త డాక్టర్ నిర్మల, సహాయ వ్యవసాయ సంచాలకులు రాజ్ నారాయణలు అవగాహన కల్పించారు. రామయంపేట మండలం ఆర్. వెంకటాపూర్ గ్రామంలో యాదయ్య అనే రైతు క్షేత్రాన్ని సందర్శించి పంటలను పరిశీలించారు. వరి పంట చిరు పొట్ట దశలో ఉన్నప్పుడు కార్ టాప్ హైడ్రోక్లోరైడ్, కార్బన్డిజం మ్యాంకో జబ్ కలిగిన తెగులు మందును పిచికారీ చేయాలని సూచించారు. దీనివల్ల కాండం తొలిచే పురుగు, అగ్గి తెగులును కొంత వరకు అరికట్టవచ్చని తెలిపారు.
…





