భారత్ సమాచార్, మెదక్ జిల్లా: ప్రజలకు భోగి, మకర సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మంగళవారం పేర్కొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. హిందువులు జరుపుకునే పండుగల్లో అతి పెద్ద పండగ సంక్రాంతి అని, ఈ పండగను మొదటి రోజు భోగి, రెండవ రోజు సంక్రాంతి, మూడవ రోజు కనుమగా మూడు రోజులు జరుపుకుంటారని తెలిపారు. పేద, ధనిక తారతమ్యాలు లేకుండా అన్ని వర్గాల ప్రజలు పండుగను సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. అందరి భాగస్వామ్యంతో అభివృద్ధిలో…