భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఇనుగుర్తి మండల కేంద్రంలోని ముదిరాజ్ కులస్తులు వారి ఆరాధ్య దైవమైన పెద్దమ్మ తల్లికి గురువారం భక్తిశ్రద్ధలతో ఘనంగా పూజలు చేశారు. గ్రామంలోని ముదిరాజ్ కుటుంబాలకు చెందిన మహిళలతో పాటు చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘం అధ్యక్షులు మాలి ముత్తయ్య మాట్లాడుతూ.. చెరువులు జలకళతో ఉట్టిపడుతూ, పాడి పంటలు సమృద్ధిగా పండి, ప్రజలు ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. ఈ…