భారత్ సమాచార్, జాబ్స్ అడ్డా : తెలంగాణ నిరుద్యోగులకు తెలుగులో నచ్చని ఒకే పదం ‘త్వరలో’. గత పదేండ్లుగా వినివిని అలసిపోయారు. ‘త్వరలో’ ఎప్పుడొస్తుందో.. మంచి రోజులు ఎప్పుడొస్తాయో వారికి అసలే తెలియడం లేదు. దశాబ్ద కాలంగా ‘‘కొలువుల జాతర’’, ‘‘కొలువుల పండుగ’’ అనే మాటలు.. కర్ణకఠోరంగా ఉంటున్నాయి.

తాము అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగుల సమస్యలన్నీ పరిష్కరిస్తాం అని కాంగ్రెస్ నేతలు చెప్పారు. వారి చెప్పిన ప్రకారం.. ఫిబ్రవరి 1న గ్రూప్-1 నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంది. మరి ఇప్పటివరకూ టీఎస్పీఎస్సీ బోర్డు రాజీనామాలే…