భారత్ సమాచార్, నిజామాబాద్ జిల్లా: ఎస్‌ఐఆర్–2025 కార్యక్రమాల పురోగతిని అంచనా వేసేందుకు బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో ఎడపల్లి మండలం జానకంపేట గ్రామాన్ని సందర్శించి క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించారు. ఓటరు జాబితా శుద్ధీకరణలో భాగంగా ప్రస్తుత ఓటర్ల వివరాలను 2002 నాటి జాబితాతో సరిపోల్చుతూ మ్యాపింగ్ ప్రక్రియను సమీక్షించారు. అర్హులైన ఓటర్ల సంతాన వివరాల నమోదు, ద్వంద్వ ఓటర్లను నివారించేందుకు స్వీయ–సంతాన గుర్తింపు పద్ధతుల అమలును పరిశీలించారు. ఈ సందర్భంగా తప్పుగా మ్యాప్ అయిన ఓటర్లను గుర్తించి వెంటనే సరిదిద్దాలని అధికారులను ఆదేశించారు.…