భారత్ సమాచార్.నెట్, సూర్యాపేట జిల్లా: సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని పుల్లారెడ్డి చెరువును తక్షణమే పునరుద్ధరించాలని, గతంలో విడుదలైన నిధుల దుర్వినియోగంపై న్యాయవిచారణ చేపట్టాలని సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ డివిజన్ కార్యదర్శి కొత్తపల్లి రేణుక డిమాండ్ చేశారు. పట్టణ సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన పాదయాత్రలో భాగంగా శుక్రవారం నాయకులు కొత్తగూడ బజార్లోని పుల్లారెడ్డి చెరువును పరిశీలించారు.
ఈ సందర్భంగా రేణుక మాట్లాడుతూ.. ఒకప్పుడు స్వచ్ఛమైన నీటితో ఉన్న చెరువు, నేడు 12 అడుగుల పూడిక, గుర్రపుడెక్క, విష వ్యర్థాలతో కాలుష్య కాసారంగా మారిందని ఆవేదన…

