భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: నేటి రాశిఫలాలు కింది విధంగా ఉన్నాయి.

మేషం: ఉద్యోగయత్నాలు మందకొడిగా సాగుతాయి. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత కలుగుతుంది. కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడులు పెరుగుతాయి. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో కొన్ని సమస్యలు తప్పవు. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి.

వృషభం: చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. వ్యాపారాలలో ఒడిదుడుకులు అధికమవుతాయి. సన్నిహితుల నుంచి కీలక సమాచారం అందుతుంది. నూతన రుణాలు చేస్తారు. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు నిలకడగా…