భారత్ సమాచార్, సినీ టాక్స్ : సూర్య-జ్యోతిక అందమైన జంట. సౌత్ సినీ సెలబ్రిటీల్లో వీరి జంటకు ప్రత్యేక స్థానముంది. తమ నటనతో వీళ్లు లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. జ్యోతిక కెరీర్ టాప్ లో ఉన్నప్పుడే సూర్యను 2006లో పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు. ఇక పెళ్లయిన తర్వాత జ్యోతిక సినిమాల్లో నటించింది. దానికి సూర్య ఏనాడూ వద్దని చెప్పలేదు. జ్యోతిక హీరోయిన్ ఓరియంటెడ్ మూవీలు చేస్తూ అడపాదడపా జనాలను అలరిస్తూనే ఉంది. ఇక సూర్య ఫుల్ బిజీ యాక్టర్.…