July 28, 2025 5:16 pm

Email : bharathsamachar123@gmail.com

BS

Nimisha Priya: భారత్ నర్సు నిమిషా ప్రియకు ఉరిశిక్ష

భారత్ సమాచార్.నెట్: యెమెన్ దేశస్థుడి హత్య కేసులో భారతీయ నర్సు నిమిష ప్రియాకు ఆ దేశం ఉరిశిక్ష విధించింది. గతకొంత కాలంగా పెండింగ్‌లో ఉన్న నిమిష క్షమాభిక్ష పిటిషన్‌ను తాజాగా ఆ దేశ అధ్యక్షుడు ఆమోదం తెలిపారు. దీంతో జులై 16న ఆమెకు ఉరిశిక్ష విధించేందుకు జైలు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నిమిష మరణశిక్ష అమలుపై యెమెన్‌ జైలు అధికారులు కేరళలోని ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్లు సమాచారం.
అలాగే నిమిష ఉరిశిక్షపై భారత్ విదేశాంగ శాఖ కూడా స్పందించింది. నిమిష ప్రియాకు శిక్ష ఖరారైన నాటి నుంచి ఆమె కుటుంబంతో తాము నిరంతరం సంప్రదిస్తున్నామని తెలిపింది. ఆమెను ఉరిశిక్ష నుండి తప్పించేందుకు భారత ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తోందని కూడా స్పష్టం చేసింది. అయితే, గతంలో నిమిష ప్రియా క్షమాభిక్ష కోరినా యెమెన్ అధ్యక్షుడు రషద్ అల్-అలిమి దాన్ని తిరస్కరించినట్లు పేర్కోన్నారు.
ఇకపోతే కేరళ రాష్ట్రంలోని పాలక్కాడ్ జిల్లాకు చెందిన నిమిష ప్రియా.. అక్కడే నర్సింగ్ కోర్సు పూర్తి చేసింది. ఆమె కుటుంబం ఆర్థికగా ఇబ్బందుల్లో ఉండడంతో తన కుటుంబానికి అండగా ఉండాలనే లక్ష్యంతో.. 2008లో ఆమె యెమెన్ వెళ్లి అక్కడ ఉద్యోగంలో చేరింది. అక్కడ పలు ఆస్పత్రుల్లో నర్సుగా పనిచేసిన ఆమెకు 2014లో ఆ దేశస్థుడు త‌లాల్ అబ్దో మ‌హ‌దితో పరిచయం అయింది. ప్రియా భ‌ర్త, ‌ఆమె కూతురు 2014లో భారత్‌కు  తిరిగి వ‌చ్చారు. కానీ ఉద్యోగం కారణంగా ప్రియా వెన‌క్కి రాలేక‌పోయింది.
అయితే ఉద్యోగం కోసం మ‌హ‌దితో కలిసి 2015లో క్లినిక్‌ను ప్రారంభించింది. కానీ ఇద్దరి మ‌ధ్య కొన్నాళ్లకు గొడ‌వలు మొదలవ్వడంతో ఆమె అతడిపై కేసు పెట్టింది. జైలు నుంచి విడుదలైన తర్వాత మ‌హది.. నిమిష పాస్‌పోర్టును లాగేసుకున్నాడు. ఈ క్రమంలోనే పాస్‌పోర్టు తీసుకునేందుకు అతనికి మత్తు ఇంజెక్షన్‌ ఇవ్వగా, అధిక మోతాదు కారణంగా మెహదీ మరణించాడని ప్రియపై హత్య కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి అధికారులు కోర్టులో ఆధారాలు సమర్పించడంతో, యెమెన్ న్యాయస్థానం నిమిష ప్రియాకు అక్కడి చట్టాల ప్రకారం ఉరిశిక్ష ఖారారు చేసింది.
Share This Post
error: Content is protected !!