భారత్ సమాచార్, దిల్లీ ;
2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత ఈ ఏడాది కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ఏడోసారి లోక్ సభలో దేశ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. 2047 కల్లా వికసిత్ భారత్ అనే లక్ష్యానికి తగినట్లు బడ్జెట్ ను రూపకల్పన చేసినట్టు తెలిపారు. రూ.32.07 లక్షల కోట్లతో కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. నిర్మలమ్మ బడ్జెట్ లోని హైలెట్స్…
తొమ్మిది ప్రధాన అంశాలతో ఈ ఏడాది బడ్జెట్ థీమ్ ను రూపొందించారు…అవి
- వ్యవసాయంలో ఉత్పాదకత పెంచడం
- ఉద్యోగం, నైపుణ్యాలు పెంచడం
- మానవ వనరుల అభివృద్ధి-సామజిక న్యాయం
- తయారీరంగం, సేవలు
- పట్టణాల అభివృద్ధి
- ఇంధన భద్రత
- మౌలిక వసతుల అభివృద్ధి
- ఆవిష్కరణలు, పరిశోధన-అభివృద్ధి
- కొత్తతరం సంస్కరణలు
ఈ బడ్జెట్ లో బంగారం, వెండి, మొబైల్ ఫోన్ల పై పన్ను శాతం తగ్గించిన కారణంగా వీటి ధరలు తగ్గనున్నాయి.
- తగ్గనున్న బంగారం, వెండి ధరలు
- సెల్‌ఫోన్లపై 15 శాతం కస్టమ్ డ్యూటీ తగ్గింపు
- లెదర్ ఉత్పత్తులపై పన్ను శాతం తగ్గింపు
- మూడు క్యాన్సర్ మందులపై జీఎస్టీ తొలగింపు
- ఎక్స్‌రే మిషన్లపై జీఎస్టీ తగ్గింపు
- 25 రకాల కీలక ఖనిజాలపై కస్టమ్ డ్యూటీ తగ్గింపు
- సోలార్ ఉత్పత్తులపై కస్టమ్ డ్యూటీ తగ్గింపు
- రూ.32.07 లక్షల కోట్లతో కేంద్ర బడ్జెట్
ఈ బడ్జెట్ లో అనూహ్యంగా ప్లాస్టిక్ ధరలను పెంచేశారు
ప్లాస్టిక్ ఉత్పత్తులపై 25 శాతం పన్నును పెంచేశారు
ఈ బడ్జెట్ లో వీటికి పెద్ద పీట వేశారు
📌మౌలిక సదుపాయాల కల్పనకు బడ్జెట్‌లో పెద్దపీట రూ.11.11 లక్షల కోట్లు కేటాయించిన కేంద్రం
📌మహిళాభివృద్ధికి రూ.3 లక్షల కోట్లు
📌గ్రామీణాభివృద్ధికి రూ.2.66 లక్షల కోట్లు
📌అర్బన్ హౌసింగ్ కోసం రూ.2.2 లక్షల కోట్లు
📌వ్యవసాయం, అనుబంధ రంగాలకు రూ.1.52 లక్షల కోట్లు
📌స్టాంప్ డ్యూటీ పెంచుకునేందుకు రాష్ట్రాలకు అనుమతి
📌మహిళల ఆస్తుల రిజిస్ట్రేషన్‌పై స్టాంప్ డ్యూటీతగ్గింపు
📌ముద్రలోన్ పరిమితి రూ.20 లక్షలకు పెంపు
📌యువత కోసం ఐదు పథకాలతో పీఎం ప్యాకేజ్
📌విద్య, నైపుణ్యాభివృద్ధికి రూ.లక్షా 48 వేల కోట్లు
📌కోటి ఇళ్లకు సోలార్ ప్యానెళ్ల ద్వారా ఉచిత విద్యుత్
📌ఐదు వరద బాధిత రాష్ట్రాలకు ప్రత్యేక నిధులు
📌MSMEలకు క్రెడిట్ గ్యారంటీ పథకాలు
📌త్వరలో రూ.100 కోట్ల రుణాలు ఇచ్చే కొత్త పథకం
📌తనఖాలు, గ్యారంటీలు లేకుండా.. యంత్రపరికరాల కొనుగోలుకు టెర్మ్ రుణాలు
📌100 నగరాల్లో ప్లగ్ &ప్లే తరహా పారిశ్రామిక పార్కులు
📌దేశంలో చిన్న ఎయిర్‌పోర్టుల నిర్మాణానికి ప్రోత్సాహం
📌వారణాసి తరహాలో గయాలో టెంపుల్ కారిడార్
ఉద్యోగాలు – నైపుణ్యాలు
📌ఐదు పథకాల కోసం PM ప్యాకేజీ
📌విద్య, ఉద్యోగాలు నైపుణ్యాల కోసం రూ.2 లక్షల కోట్లు
📌ఇందులో ఈ ఏడాదిలో రూ.1.48 లక్షల కోట్లు
📌ఉన్నత విద్యారుణాలకు రూ.10 లక్షలు
ఈ సారి ఆంధ్రప్రదేశ్ స్పెషల్...
పార్లమెంట్ లో నెంబర్ గేమ్ కారణంగా ఆంధ్రప్రదేశ్, బిహార్ రాష్ట్రాలకు అత్యధిక నిధుల కేటాయింపులు జరిగాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ప్రస్తావన తేలేదు కానీ… భారీగానే నిధుల కేటాయింపు మాత్రం జరిపారు. పోలవరం సత్వర నిర్మాణానికి సంపూర్ణ సాయం అందిస్తామని ప్రకటించారు. రాజధాని అమరావతి అభివృద్ధికి రూ.15 వేల కోట్లు ప్రత్యేక సాయం ఉంటుందని తెలిపారు. అవసరాన్ని బట్టి భవిష్యత్తులో అమరావతికి మరిన్ని అదనపు నిధులు కేటాయిస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం పారిశ్రామికాభివృద్ధికి ప్రత్యేక సహకారం ఉంటుందన్నారు. విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్‌లోని నోడ్‌లకు ప్రత్యేక సాయం చేస్తామన్నారు. హైదరాబాద్-బెంగళూరు పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తామన్నారు. కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక కేంద్రాలకు నీళ్లు, విద్యుత్, రోడ్లు, హైవేల అభివృద్ధికి నిధులు ఉంటాయని చెప్పారు. వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక కేటాయింపులు ఉంటాయన్నారు.