భారత్ సమాచార్,సినీ టాక్స్ : చూడ్డానికి ప్రిన్సెస్ లా కనిపించే కత్రినాలో యాక్షన్ ఎలిమెంట్స్ కూడా చాలానే ఉన్నాయి అన్న విషయం సినీ ప్రేమికులకు బాగా తెలిసిందే. సరిగ్గా వాడుకుంటే లేడీ ఒరియెంటేడ్ మూవీ తీసి ఇండియా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ కూడా కొట్టేయవచ్చు. అద్దిరిపోయే అందంతో కుర్రకారును రెచ్చగొట్టే ఈ బాలీవుడ్ లండన్ బ్యూటీ టైగర్ -3 హిట్ తో సంబురంగా ఉంది. గతంలో సల్మాన్ ఖాన్ తో డేట్ చేసిన కత్రినా.. సహచరనటుడు విక్కీ కౌశల్ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. విక్కీ తన భార్య కత్రినా హార్డ్ వర్క్ పై తాజాగా ప్రశంసల వర్షం కురిపించాడు. తన రాబోయే ‘ సామ్ బహదూర్’ మూవీ ప్రమోషన్స్ లో అతడు బిబీబిజీ అయిపోయాడు. ఓ ఇంటర్వ్యూలో తన భార్య కత్రినా గురించి మీడియా ముందు ఇలా చెప్పుకొచ్చాడు.
‘‘టైగర్-3 లో కత్రినా యాక్టింగ్ స్కిల్స్ చూసి ఫిదా అయిపోయాను. ముఖ్యంగా టవల్ ఫైట్ చూసి మైండ్ బ్లాంక్ అయిపోయింది. వెంటనే తనకు ఓ విషయం చెప్పా. కత్రిన.. నాపై మాత్రం టవల్ ఫైట్ ప్రయోగించవద్దు అని కోరా..నీతో ఏ విషయంపై ఆర్గ్యూ చేయను. నాకు తెలిసి బాలీవుడ్ లో నువ్వే అత్యంత, అద్భుతమైన యాక్షన్ హీరోయిన్…’’ అని కత్రినాను మెచ్చుకున్నట్టు చెప్పుకొచ్చాడు. టవల్ ఫైట్ కోసం కెమెరా ముందు కూడా ఆమె నిజంగా చాలా హర్డ్ వర్క్ చేసిందని, ఆమె తనను విపరీతంగా ఇన్ స్పైర్ చేసిందని అభిమానులతో పంచుకున్నాడు. కాగా, విక్కీ కౌశల్ నటించిన ‘సామ్ బహదూర్’ డిసెంబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది. ఇదే రోజు మోస్ట్ ఎవైటెడ్ మూవీ సందీప్ రెడ్డి వంగా ‘యానిమల్’ కూడా రిలీజ్ కానుంది. మరి ఇంత టఫ్ ఫైట్ కు ఎందుకు సిద్ధమయ్యారని విక్కీని ప్రశ్నిస్తే.. ఎన్ని సినిమాలు విడుదలైన కూడా ఆడియన్స్ ఎప్పడూ మంచి సినిమాలను కచ్చితంగా ఆదరిస్తామని, ఎవరిని గెలిపించాలో వారికి బాగా తెలుసు అని చెప్పాడు.