Homebreaking updates newsBhadrachalam Temple : భద్రాద్రి రామయ్యకు కానుకల సమర్పణ ఇనాటిది కాదు..!

Bhadrachalam Temple : భద్రాద్రి రామయ్యకు కానుకల సమర్పణ ఇనాటిది కాదు..!

భారత్ సమాచార్.నెట్, భద్రాచలం: తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలం (Bhadrachalam)లో కొలువైన శ్రీ సీతారాముల ఆలయంలో శ్రీరామనవమి (Srirama Navami)వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. మిథిలా స్టేడియంలోని మిథిలా మండపంలో వేద మంత్రోచ్ఛరణలు, రామ భక్తుల జయజయ ధ్వనాల మధ్య అభిజిత్ లగ్నంలో సరిగ్గా మధ్యాహ్నం 12.13 గంటలకు భద్రాద్రి సీతారాముల కళ్యాణం కన్నుల పండువగా జరిగింది. శ్రీరామనవమి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తరఫున సీఎం రేవంత్ రెడ్డి (Cm Revanth Reddy) దంపతులు స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. సీతారాముల కళ్యాణం (Sitarama Kalyanam) తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. భక్తుల రాకతో ఆలయ ప్రాంగణం అంతా రామ నామస్మరణతో మార్మోగింది.

ప్రతి ఏడాది జరిగే శ్రీరామనవమి వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనావాయితీగా వస్తోంది. అయితే ఈ ఆనవాయితీ ఇప్పటిది కాదు. ఈ సంప్రదాయానికి దాదాపు 135 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. నిజాం కాలం నుంచి ప్రారంభమైన ఈ సంప్రదాయం మత సామరస్యానికి ప్రతీకగా.. భద్రాచలం రాములవారి కల్యాణానికి సర్కార్ నుంచి కానుకలు అందేవి. 1890లలో హైదరాబాద్ రాష్ట్ర అధికారిక ప్రతినిధి బృందం ఆరో నిజాం నవాబ్ మీర్ మహబూబ్ అలీ ఖాన్ బహదూర్ తరపున భద్రాచలం ఆలయానికి కానుకలు సమర్పించారు. ఈ సంప్రదాయం కుతుబ్ షాహీలతో ప్రారంభమై నేటికీ తెలంగాణ ప్రభుత్వం ద్వారా కొనసాగుతోంది.

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయానికి నిజాం నవాబులు కానుకలు అందించిన చరిత్ర గురించి కొన్ని ఆసక్తికరమైన వివరాలు కూడా ఉన్నాయి. నిజాం రాజవంశం, ముఖ్యంగా ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ తన దాతృత్వంతో ప్రసిద్ధి చెందిన వ్యక్తిగా నిలిచారు. ఆయన మత విశ్వాసాలకు అతీతంగా హిందూ, ముస్లిం దేవాలయాలకు, ఇతర సంస్థలకు ఉదారంగా విరాళాలు ఇచ్చారు. భద్రాచలం ఆలయానికి సంబంధించి నిజాం రాజులు ఈ పుణ్యక్షేత్రాన్ని గౌరవించారు. ఆలయ నిర్వహణకు ఆర్థిక సహాయం కూడా అందించారు. చారిత్రక ఆధారాల ప్రకారం.. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ భద్రాచలం ఆలయానికి రూ. 29,999 విరాళంగా ఇచ్చినట్లు తెలిసింది. ఈ సొమ్ము ఆ కాలంలో చాలా ఎక్కువ అని దాన్ని ఆలయ అభివృద్ధికి ఉపయోగించినట్లు సమాచారం. కాగా, భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం దేవాదాయ శాఖ పరిధిలోకి వెళ్లిన తరువాత తొలినాళ్లలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి లేదా దేవాదాయ శాఖ కమిషనర్‌ రాష్ట్ర ప్రభుత్వం తరపున ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించేవారు.

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments