Homemain slidesనా మనసెందుకు విరిగిందే మళ్లీ మళ్లీ...

నా మనసెందుకు విరిగిందే మళ్లీ మళ్లీ…

భారత్ సమాచార్, సినీ టాక్స్ ; స్టార్ బాయ్ సిద్దూ, ఓ మై లిల్లీ.. నా మనసెందుకు విరిగిందే మళ్లీ మళ్లీ… అంటూ మలయాళ క్యూటీ గర్ల్ అనుపమ వెంట పడుతున్నాడు. ‘టిల్లు స్వేర్’ చిత్రం నుంచి ఓ మై లిల్లి అంటూ సాగే సింపుల్ మెలోడీ లిరికల్ వీడియోని నెట్టింట విడుదల చేశారు దర్శక నిర్మాతలు. సంగీత దర్శకుడు అచ్చు స్వరపరిచిన ఈ గీతం బ్యూటిపుల్ మెలోడీ గా ప్రతి సంగీత ప్రేమికుడి మనసును హత్తుకుంటోంది. సింగర్ శ్రీరామ చంద్ర గానం విన సొంపుగా గా ఉంది. ఈ పాటను సిద్దు, రవి ఆంటోని కలిసి రచించారు. ఈ చిత్రాన్ని దర్శకుడు రామ్ తెరకెక్కించాడు. ఈ మూవీని మార్చి 29న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు నిర్మాత. డీజే టిల్లు మొదటి భాగం సిద్దు జొన్నలగడ్డని స్టార్ బాయ్ సిద్దు గా మర్చింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై భారీ హైప్ ను క్రియేట్ చేసింది.

మరికొన్ని సినీ సంగతులు…

5 రోజుల్లో 85 కోట్లు… అట్లుంటది మనతోని

RELATED ARTICLES

Most Popular

Recent Comments