భారత్ సమాచార్.నెట్: లాస్ ఏంజెలెస్ వేదికగా 2028లో ఒలింపిక్స్ జరగనున్న సంగతి తెలిసిందే. దాదాపు 128 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌కి క్రికెట్ అడుగుపెడుతోంది. తాజాగా ఒలింపిక్స్ క్రిడల షెడ్యూల్‌ను విడుదల చేశారు నిర్వాహకులు. టీ20 ఫార్మాట్‌లో ఈ మ్యాచ్‌లు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇందుకోసం ఐసీసీ ఫుల్ మెంబర్స్‌గా ఉన్న 12 జట్లతో సహా దాదాపు 100 దేశాల నుంచి జట్లను ఎంపిక చేయనున్నారు.
పురుషులు, మహిళల విభాగాల్లో ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. అన్ని మ్యాచ్‌లు టీ20 ఫార్మాట్‌లో జరుగుతాయి. ఇకపోతే షెడ్యూల్ ప్రకారం.. 2028 జూలై 12న క్రికెట్ మ్యాచ్‌లు మొదలు కానున్నాయి. జూలై 12 నుంచి 18 వరకు, జూలై 22 నుంచి 28 వరకు రెండు విడతల్లో గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లు జరగనున్నాయి. పురుషుల సెమీఫైనల్, మెడల్ మ్యాచ్ జూలై 19న, మహిళల సెమీఫైనల్, మెడల్ మ్యాచ్‌లు జూలై 29 నిర్వహించనున్నారు. ఆరు జట్లు గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ కోసం పోటీ పడనున్నాయి.
ఇకపోతే ప్యారిస్ వేదికగా 1900లో ఒలింపిక్స్‌లో తొలిసారిగా క్రికెట్ నిర్వహించారు. అదే తొలిసారి.. ఆఖరి సారిగా కావడం గమానార్హం. అప్పట్లో కేవలం గ్రేట్ బ్రిటన్, ఫ్రాన్స్ మాత్రమే పాల్గొన్నాయి. ఈ మ్యాచ్‌లో బ్రిటన్ 158 పరుగుల తేడాతో గెలుపొందింది. ఆ తర్వాత ఇప్పటి వరకు క్రికెట్ ఒలింపిక్స్‌లో పాల్గొనలేదు. ఇప్పుడు లాస్ ఏంజెలెస్ వేదికగా మరోసారి క్రికెట్‌కు అవకాశం లభించడంతో క్రికెట్ ప్రేమికులు ఆనందానికి హద్దే లేదు.
Share This Post