Homebreaking updates newsఒక్కటా..రెండా.. ‘సలార్’లో ఎన్ని విశేషాలో!

ఒక్కటా..రెండా.. ‘సలార్’లో ఎన్ని విశేషాలో!

భారత్ సమాచార్, సినీ టాక్స్ : వరల్డ్ వైడ్ గా ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా.. అని ఎదురుచూస్తున్న ‘సలార్’ మూవీ మరికొన్ని గంటల్లో థియేటర్లలో సందడి చేయనున్నది. ఇప్పటికే థియేటర్ల వద్ద ఫ్యాన్స్ భారీ కటౌట్లు పెట్టి హంగామా చేస్తున్నారు. దేశంలో ఎక్కడ చూసినా సలార్ గురించే చర్చ నడుస్తోంది. సోషల్ మీడియాలో, మెయిన్ మీడియాలో సలార్ గురించిన వార్తలే చక్కర్లు కొడుతున్నాయి.. రూ.400కోట్ల భారీ బడ్జెట్ తో రానున్న ఈ మూవీ విశేషాలు చదవండి మరి..

– ప్రభాస్ కు ఉన్న పాన్ ఇండియా స్టార్ క్రేజ్ తో కాకుండా ‘దేవా’ పాత్రకు ప్రభాస్ సరిపోతాడు అని భావించిన తర్వాతే హీరోగా ఆయన్ను ఎంపిక చేశారు. మూవీని రెండు పార్టులుగా విడుదల చేయాలనే ఆలోచన మొదట్లో నీల్ కు లేదు. షూటింగ్ సమయంలోనే రెండు పార్టులుగా విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారు.

– ‘సలార్’ స్టోరీ ఐడియా ఇప్పటిది కాదట..15 ఏండ్ల కిందట ప్రశాంత్ నీల్ కు ఈ మూవీ లైన్ మైండ్ లో మెదిలిందట. అప్పుడింక అతడు దర్శకుడు కూడా అవ్వలేదు. సలార్ మూవీకి ఎక్కువ బడ్జెట్ అవుతుందని, కొన్ని సినిమాలు చేసిన తర్వాత.. చేద్దామనుకున్నాడట. ఆయన తొలి మూవీ ఉగ్రం అయినా.. కేజీఎఫ్ 1,2 లతో పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోయాడు. దీంతో సలార్ కథను తెరకెక్కించే ప్రయత్నం చేశాడట.

– సినిమాటిక్ యూనివర్స్ ట్రెండ్ నడుస్తున్న ఈ కాలంలో.. కేజీఎఫ్ కు సలార్ కు లింక్ ఉందని అంతా భావించారు. పోస్టర్లు, ట్రైలర్ చూసిన వాళ్లు కూడా అంతా కేజీఎఫ్ లాగానే కనపడుతోంది అనుకున్నారు. అయితే ఆ కథకు, ఈ కథకు ఏ సంబంధం లేదని ప్రశాంత్ నీల్ క్లారిటీ ఇచ్చారు. అలాగని ఉగ్రం కథకు రీమేక్ కూడా కాదని అన్నారు. యశ్ ఇందులో గెస్ట్ రోల్ చేస్తున్నారని వార్తలు వచ్చాయి. అవి కూడా నిజం కాదని ఆయన చెప్పారు.

– ‘దేవా’కు సమానమైన పాత్ర వరదరాజమన్నార్. ఈ రోల్ ను ముందునుంచి పృథ్వీరాజ్ సుకుమారన్ నే అనుకున్నారు. ఆయన లేకపోతే సలార్ ఉండేదే కాదని నీల్ చెప్పడం..ఆ రోల్ కు ఉన్న ఇంపార్టెన్స్ ను తెలియజేస్తోంది.

– ఈ మూవీ షూటింగ్ తెలంగాణలోని గోదావరి ఖనిలో ప్రారంభమైంది. అలాగే హైదరాబాద్, మంగళూరు, వైజాగ్ ల్లోనూ షూటింగ్ చేశారు. 1000మందితో హీరో ఫైట్ హైలెట్ గా నిలుస్తుందట.

మరికొన్ని కథనాలు…

సెగలు పుట్టిస్తున్న మృణాల్ ఠాకూర్

RELATED ARTICLES

Most Popular

Recent Comments