July 28, 2025 5:32 pm

Email : bharathsamachar123@gmail.com

BS

Boycott Turkey: ‘బాయ్‌కాట్ టర్కీ’ కి మద్దతుగా మింత్రా, అజియో 

భారత్ సమాచార్.నెట్: పాకిస్థాన్‌ (Pakistan)లోని ఉగ్రస్థావరాలను అంతం చేయడమే లక్ష్యంగా భారత్ ఆపరేషన్ సింధూర్ (Operation Sindoor) చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ సమయంలోనే పాకిస్థాన్‌కు బహిరంగంగా మద్దతు (Support) తెలిపిన టర్కీ (Turkey) దేశంపై భారతీయులు (Indians) ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ దేశానికి చెందిన ఉతప్పత్తులను బహిష్కరించాలని ‘బాయ్ కాట్ టర్కీ’ (Boycott Turkey) పేరుతో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఊపందుకుంది.
ఈ క్రమంలోనే ‘బాయ్‌కాట్‌ టర్కీ’ ఉద్యమానికి వ్యాపార వర్గాలు కూడా మద్దతు తెలిపాయి. ప్రముఖ ఆన్‌లైన్ రిటైల్ సంస్థలు మింత్రా, అజియో.. టర్కీ బ్రాండ్ల అమ్మకాలను నిలిపివేసి.. తమ వెబ్‌సైట్‌ల నుంచి వాటిని తొలగించాయి. గత వారం రోజుల నుంచి ఇరు దేశాల మధ్య దౌత్య ఉద్రిక్తతలు పెరుగుతున్న ఈ నిర్ణయం తీసుకున్నట్లు మింత్రా అధికారి తెలిపారు. రిలయన్స్‌ గ్రూప్‌ యాజమాన్యంలో ఉన్న అజియో సంస్థ ‘కోటాన్‌’, ‘ఎల్‌సీ వైకికి’, ‘మావి’ లాంటి టర్కీ  బ్రాండ్ల అమ్మకాలను నిలిపివేసినట్లు ఆ సంస్థ అధికారి ఒక్కరు వెల్లడించారు.
అంతేకాకుండా టర్కీలోని తమ సంస్థ కార్యకలాపాలను కూడా మూసివేసినట్లు రిలయన్స్ తెలిపింది. ఈ బహిష్కరణ కేవలం ఆన్‌లైన్ రిటైల్ సంస్థలకే పరిమితం కాలేదు. అఖిల భారత వ్యాపారుల సమాఖ్య (కెయిట్‌) టర్కీ, అజర్‌బైజాన్‌ దేశాలతో వ్యాపార సంబంధాలను పూర్తిగా తెంచుకోవాలని పిలుపునిచ్చింది. భారత్ ఎగుమతిదారులు, దిగుమతిదారులు కూడా ఈ దేశాల్లోని కంపెనీలతో ఎలాంటి లావాదేవీలూ జరిపవద్దని కెయిట్ సూచించింది.
Share This Post
error: Content is protected !!