భారత్ సమాచార్.నెట్: పహల్గామ్ ఉగ్రదాడి (Pahalgam Terror attack) అనంతరం భారత్ (India), పాక్ (Pakistan) మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పాకిస్థాన్ ఉగ్రదాడికి భారత్ ప్రతీకార చర్యలు చేపట్టింది. మంగళవారం అర్థరాత్రి దాటక ‘ఆపరేషన్ సింధూర్’ (Operation Sindoor) పేరిట భారత్ త్రివధ దళాలు మెరుపు దాడులకు దిగింది. ఈ దాడుల్లో 80 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. మొత్తం 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది భారత్ ఆర్మీ. భారతదేశానికి వ్యతిరేకంగా ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్న స్థావరాలు అవి.
భారతదేశంపై విద్వేషంతో భారత్ మీద ఉగ్రదాడులు చేయడానికి, కశ్మీర్‌ను అల్లకల్లోలం చేయడమే ఏకైక లక్ష్యంగా పాకిస్తాన్ తమ భూభాగం మీద పలు ఉగ్రవాద సంస్థలను పెంచి పోషిస్తోంది. వాటిలో ప్రధానమైనవి లష్కరే తయ్యబా, జైషే మొహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ మొదలైనవి. ఆ సంస్థలు ఉగ్రవాదులకు శిక్షణనిచ్చి, భారత్‌పై దాడులకు కుట్రలు పన్ని, దానికి తగిన ప్రణాళికలతో భారత్ మీద దాడులను ఆపరేట్ చేసేందుకు ఉపయోగించుకున్న వాటిని గుర్తించిన కేంద్రం ఆ స్థావరాలను ధ్వంసం చేసింది.
మొత్తంగా 9 స్థావరాల మీద భారత సైన్యం దాడులు చేసింది. అవి…
1. మర్కజ్ సుభాన్ అల్లా, బహావల్‌పూర్ (జైష్ ఎ మొహమ్మద్)
2. మర్కజ్ తయ్యబా, మురీడ్కే (లష్కర్ ఎ తయ్యబా)
3. తెహ్రా కలాన్, సర్జల్ (జైష్ ఎ మొహమ్మద్)
4. మెమ్‌మూనా జోయా, సియాల్‌కోట్ (హిజ్బుల్ ముజాహిదీన్)
5. మర్కజ్ అహల్ హడీత్, బర్నాలా (లష్కర్ ఎ తయ్యబా)
6. మర్కజ్ అబ్బాస్, కోట్లీ (జైష్ ఎ మొహమ్మద్)
7. మస్కర్ రహీల్ షాహిద్, కోట్లీ (హిజ్బుల్ ముజాహిదీన్)
8. సవాయ్ నల్లా క్యాంప్, ముజఫరాబాద్ (లష్కర్ ఎ తయ్యబా)
9. సయద్నా బిలాల్ క్యాంప్, ముజఫరాబాద్ (జైష్ ఎ మొహమ్మద్)