August 8, 2025 12:10 pm

Email : bharathsamachar123@gmail.com

Breaking

Operation Sindoor: ఆపరేషన్ సింధూర్ ఇంకా పూర్తి కాలేదు: కేంద్రం

భారత్ సమాచార్.నెట్: పహల్గామ్ ఉగ్రదాడి (Pahalgam terror attack) తర్వాత భారత్ పాక్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో.. ఆపరేషన్ సింధూర్ (Operation Sindoor)  పేరిట భారత్ ఆర్మీ దాడికి దిగింది. పాకిస్థాన్‌ (Pakistan), పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ (POK) లో ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా భారత్‌ మెరుపు దాడులు చేసింది. అయితే ఆపరేషన్ సింధూర్‌పై కేంద్రం మరో విషయం ప్రకటించింది.
ఆపరేషన్ సింధూర్ ఇంకా పూర్తి కాలేదని.. ఇంకా కొనసాగుతోందని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. అయితే భద్రతా కారణాల రీత్య ఆపరేషన్‌ సిందూర్‌కు సంబంధించిన వివరాలను బయటపెట్టలేమని స్పష్టం చేశారు. ఆల్ పార్టీ మీటింగ్ అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా భారత్ ఆర్మీ చేసిన ఆపరేషన్‌ సింధూర్‌పై పాకిస్థాన్‌ అసత్య ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ఆ ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని కిరణ్‌ రిజిజు విజ్ఞప్తి చేశారు. దేశ భద్రత విషయంలో కేంద్రం అన్నీ రాష్ట్రాలకు అండగా ఉంటుందని తేల్చి చెప్పారు.
మరోవైపు తాజా పరిణామాల నేపథ్యంలో భారత్ సరిహద్దు ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఉద్రిక్తతల నేపథ్యంలోనే ముందు జాగ్రత్త చర్యగా రాజస్థాన్, పంజాబ్‌లో స్కూల్స్‌కు సెలవులు కూడా ప్రకటించారు. కాగా, పహల్గామ్  ఉగ్రదాడికి ప్రతీకారంగా బుధవారం తెల్లవారుజామున భారత్‌.. పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై సర్జికల్ స్ట్రైక్స్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో 100 మందికి పైగా ఉగ్రహదులు హతమయ్యారు.
Share This Post